Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 January 2025, 6:14 pm Posted by : ramakrishna

జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఎస్ఐకి సన్మానం

నిజామాబాద్, బతుకమ్మ : జాతీయ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు నావాతే ప్రతాప్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక మూడవ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అమందు హరిబాబు ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ మూడో టౌన్ పరిధిలో శాంతిభద్రతలకు ఆటంకం కలుగకుండ యువకులు నాందేవాడ ప్రజలు సహకరించాలని కోరారు. యువకులు మత్తుపదార్తలకు బానిసలుగా కాకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరిపే సత్యం, తుదిగేని శ్రవణ్, దయవార్ గంగాధర్, అమందు విజయ్ తదితరులు పాల్గొన్నారు.