Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 12:16 pm Posted by : ramakrishna

కరీంనగర్ లో ఎస్సై ఆత్మహత్య

 

 

కరీంనగర్, బతుకమ్మ : 

 

కరీంనగర్ జిల్లాలో ఉరివేసుకొని ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. కరీంనగర్ పట్టణంలోని రెండవ టౌన్ ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ తన అత్తగారిoట్లో గ్రామం జమ్మికుంట మండలం సీతంపేట గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐదు రోజుల క్రితం ఎస్సై చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడింది. భార్య ఆత్మహత్యకు పాల్పడటంతో మన స్థాపన చెందిన చంద్రశేఖర్ కూడా బలవన్మమరణానికి పాల్పడినట్టు తెలిసింది. చంద్రశేఖర్ దివ్య దంపతులకు ఇద్దరు కుమారులు. చంద్రశేఖర్ డెడ్ బాడీ నీ పోస్ట్ మార్టం కోసం జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐదు రోజుల వ్యవధిలో భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడడంతో మా కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి.