Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 8:04 pm Posted by : ramakrishna

50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

స్టేషన్ బెయిల్ భవిష్యత్తులో ఎలాంటి కేసులు పెట్టకుండా ఉండేందుకు కేసు నమోదైన వ్యక్తి నుంచి రూ.50 వేల లంచం తీసుకుంటూ ఎస్సై ఏసీబీకి పట్టుబడ్డారు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పని చేస్తున్న నర్సింలు మంగళవారం ఓ వ్యక్తి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖాధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఓ కేసు విషయంలో ఎస్సై నర్సింలు స్టేషన్ బెయిల్ ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి కేసులు పెట్టి వేదించకుండా ఉండాలంటే లక్ష రూపాయల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దానితో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. మొదటి విడతలో రూ.50 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు నర్సింలును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో సోదాలు నిర్వహించారు. నర్సింలు పై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ కు తరలించారు.