Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 7:59 pm Posted by : ramakrishna

పదివేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

వెబ్ డెస్క్, బతుకమ్మ :

కుటుంబ కలహాల నేపథ్యంలో వచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేయకుండా లంచం తీసుకుంటూ ఓ  ఎస్సై అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. హైదరబాద్ సిటి రెంజ్ 1 ఏసీబీ అధికారుల కథనం ప్రకారం మంగళవారం హైదరబాద్ పోలిస్ కమీషనరేట్ పరిధిలోని గోల్కొండ జోన్ ల గల టోలి చౌక్ పోలిస్ స్టేషన్ లో  ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఆర్.పాండు నాయక్ రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండేడ్ గా పట్టుకున్నారు. పోలిస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీకి చెందిన కుటుంబంలో జరిగిన గోడవలో తల్లి కొడుకు పై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే, పాస్ పోర్ట్ సీజ్ చేయవద్ధంటే రూ.10 వేల లంచం ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేశాడు. దీంతో భాధితుడు ఏసీబీని అశ్రయించడంతో వారు ఎస్సై పాండు నాయక్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోని నాంపలి ఎసిబి కోర్టులో హజరు పరిచారు.