Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 July 2025, 8:57 pm Posted by : ramakrishna

నందిపేట్ ఎస్సైగా శ్యాంరాజ్ బాధ్యతల స్వీకరణ

నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ ఎస్సైగా శ్యాంరాజ్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం శ్యాంరాజ్ పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆర్మూర్ డీఎస్పీ, సర్కిల్ అధికారులను మర్యాద పూర్వకంగా కలిసారు. నందిపేట్ మండల పరిధిలో శాంతిభద్రతల పర్యవేక్షణకు పని చేస్తానని, ప్రజలు సహకరించాలని శ్యాంరాజ్ కోరారు. ఈ సందర్భంగా నూతన ఎస్ హెచ్ వోను పోలీస్ స్టేషన్ సిబ్బంది స్వాగతం పలికారు.