రైతులను సన్మానించిన శ్రీ భాషిత విద్యార్థులు

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ లోని శ్రీ భాషిత పాఠశాలకు చెందిన విద్యార్థులు సోమవారం జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా ఆలూరు గ్రామానికి వెళ్లి పంట పొలాలను సందర్శించి రైతులకు సన్మానించారు. ఈ  సందర్శనలో విద్యార్థులు  రైతులు కష్టపడి పంటలను పండించే విధానం, వ్యవసాయానికి సంబంధించిన అనేక సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రత్యక్షంగా రైతులతో మమేకమై వారి పనులను గమనించి వారి జీవనశైలిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా విద్యార్థులు రైతుల శ్రమ వారి పోరాటం సాగు పద్ధతులు, సమకాలీన వ్యవసాయ...