Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 December 2024, 6:25 pm Posted by : ramakrishna

రైతులను సన్మానించిన శ్రీ భాషిత విద్యార్థులు

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ లోని శ్రీ భాషిత పాఠశాలకు చెందిన విద్యార్థులు సోమవారం జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా ఆలూరు గ్రామానికి వెళ్లి పంట పొలాలను సందర్శించి రైతులకు సన్మానించారు. ఈ  సందర్శనలో విద్యార్థులు  రైతులు కష్టపడి పంటలను పండించే విధానం, వ్యవసాయానికి సంబంధించిన అనేక సమస్యలను తెలుసుకున్నారు.

Shri Bhasitha students honored the farmers

ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రత్యక్షంగా రైతులతో మమేకమై వారి పనులను గమనించి వారి జీవనశైలిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా విద్యార్థులు రైతుల శ్రమ వారి పోరాటం సాగు పద్ధతులు, సమకాలీన వ్యవసాయ గురించి అవగాహనను పొందారు. ఇందులో  భాగంగా ఆలూరు అగ్రికల్చర్ ఆఫీసర్ వసుధం విద్యార్థులతో మాట్లాడి విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయం పై అవగాహన పెంచడం , రైతుల వలన నే సమాజం ముందుకు నడుస్తుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ భాషిత  పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్  మాట్లాడుతూ  విద్యార్థులు సమాజంలో వ్యవసాయ ముఖ్య ప్రాధాన్యత మరియు రైతుల యొక్క కృషిని తెలుసుకోవడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో  పాఠశాల కరస్పాండెంట్, విద్యార్థిని, విద్యార్థులు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు రైతులు పాల్గొన్నారు.

Shri Bhasitha students honored the farmers