బతుకమ్మ, భిక్కనూరు : భిక్కనూరు మండలంలోని సౌత్ క్యాంపస్ లో ఆదివారం ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్ శ్రమదానం లో భాగంగా వాలంటరీ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టారు. చెట్లకు నీళ్లు పోసి క్యాంపస్ పరిసర చుట్టుపక్కల ప్రాంతాలలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అంజయ్య మాట్లాడుతూ చదువుతో పాటు సమాజ సేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ 5 యూనిట్ వాలెంటరీలు పాల్గొన్నారు.