Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 October 2024, 4:38 pm Posted by : ramakrishna

షోరూం దుస్తులు ఫుట్ పాత్ పై విక్రయం

  • పక్కనే ఉన్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న పోలీస్, మున్సిపల్ శాఖ అధికారులు

నిజమాబాద్ సిటీ, బతుకమ్మ : దసరా పండుగ దగ్గర పడుతున్న సమయంలో బట్టల షాపింగ్ మాల్ లకు షాపింగ్ మాల్ లో స్థలం దొరకక ఫుట్పాత్ లను ఆక్రమించి మరి తమ తమ వ్యాపారాలను కొనసాగిస్తూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి కూటవేటు దూరంలోనే ఓ బట్టల షాప్ యాజమాన్యం తమ షాపింగ్ మాల్ ముంగట ఉన్న ఖాళీ స్థలంలో టెంటు వేసి మరి దుస్తుల విక్రయాలు కొనసాగిస్తున్నారు. వినియోగదారులను ఆకర్షించుకోవడానికి ఇలారోడ్డుపైకి వచ్చి మరి తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే పక్కనే ఉన్న పోలీస్ కమిషనరేట్ కార్యాలయంఅధికారులు గానీ,దాని పక్కనే ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గానీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడకుండా వ్యవహరించడం ఏంటని నగరవాసులు గుసగుసలాడుతున్నారు.

Showroom clothing is sold on the footpath