Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 December 2024, 7:05 pm Posted by : ramakrishna

ఉత్తమ ప్రతిభ కనబరచి బహుమతులు తీసుకురావాలి

  • కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, బతుకమ్మ : ముఖ్యమంత్రి కప్ 2024 రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచి బహుమతులు తీసుకరావాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సి.ఏం. కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించి విజేతలకు మెడల్స్ , ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సి.ఏం. కప్ 2024 సందర్భంగా నిర్వహించిన క్రీడల్లో విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 7,8 తేదీల్లో గ్రామ పంచాయతీ, 10 నుండి 12 తేదీల్లో మండల, మున్సిపల్ స్థాయిల్లో, 16 నుండి 21 వరకు జిల్లా స్థాయిల్లో క్రీడలు నిర్వహించడం జరిగాయని, 8000 మంది క్రీడాకారులు గ్రామ స్థాయిల్లో 13 ఈవెంట్లలో పాల్గొన్నారని, ఒకవేయి మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొననున్నారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో కామారెడ్డి జిల్లా  క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచి బహుమతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఖో ఖో, కబడ్డీ, వాలీబాల్ రివెంట్లలో విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, క్రమశిక్షణ అంకిత భావం కలిగి ఉంటే క్రీడల్లో రాణిస్తారని తెలిపారు. జిల్లా స్థాయిలో రాణించిన క్రీడాకారులు అదే స్ఫూర్తితో రాష్ట్ర స్థాయిలో రాణించాలని తెలిపారు. ఓడిన వారు క్రింగిపోకుండా మరోమారు క్రీడల్లో పాల్గొని సత్తా చాటాలని అన్నారు. కష్టపడి చదవాలని ఏదో ఒక ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని అన్నారు. మత్తు పానీయాలకు, డ్రగ్స్ బారిన పడకూడదని తెలిపారు. జిల్లా గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ,గ్రంథాలయాల్లో చదువుకొని 245 మంది నిరుద్యోగులు ఉద్యోగాలు సంపాదించారని తెలిపారు. విద్యార్థులు చిన్ననాటి నుండే గ్రంథాలయాల్లో చదవాలని సూచించారు. సెల్ ఫోన్ ల బారిన పడకూడదని తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఇందు ప్రియ మాట్లాడుతూ, హార్డ్ వర్క్ చేయడం ద్వారా రాష్ట్ర స్థాయి పోటీల్లో అవకాశం వచ్చిందని, మరింత కృషిచేసి రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలవాలని అన్నారు. అనంతరం విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి జగన్నాథ్, అథ్లెటిక్ జనరల్ సెక్రటరీ హరిలాల్, పలు పాఠశాలల ఫిజికల్ డైరెక్టర్లు, పి.ఈ.టీ.లు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Show your best talent and bring prizes