Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 2:38 pm Posted by : ramakrishna

జి సీఈఓ కు షోకాజ్ నోటీసులు

 

. . . జీతం క్లైయిమ్ చేసుకోరాదని  ఉత్తర్వులు

 నిజామాబాద్, బతుకమ్మ:

నిజామాబాద్ జిల్లా జి సిఇఓ భాగ్యలక్ష్మి కి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల జిల్లా కలెక్టర్ సిరికొండ మండలంలోని కేజీబీవీ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడ వచ్చిన ఫిర్యాదులు, సమగ్ర శిక్ష అభియాన్ కార్యక్రమంలో జరిగిన అవకతవకలకు నేపథ్యంలో షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. సిరికొండ మండలం లో కేజీబీవీ లో పనిచేస్తున్న సిఆర్ టికి  గత 11 నెలల నుంచి జీతం అపినట్లు గుర్తించారు. సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న జి సీఈఓ నిరంతరం క్షేత్రస్థాయి పరిశీలన చేయకపోవడం, సమస్యలన్నింటినీ పెండింగ్లో పెట్టి కలెక్టర్ చైర్మన్ అయినప్పటికీ కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లడం లో విఫలమయ్యారు అని తెలిసింది. సమగ్ర శిక్షణలో భాగంగా నిర్వహించే పనులు పెండింగ్లో పెట్టడం, ఇటీవల మంచిర్యాల్, సిరిసిల్ల , కామారెడ్డి ఎస్ ఓ ల  తో శిక్షణ  ఓ ప్రైవేట్ హోటల్ లో ఐదు రోజులు నిర్వహించిన కేవలం 42 మందికి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం లంచ్ రాత్రి డిన్నర్ కు 5 లక్షల పదహారు వేలు ఖర్చయినట్లు చూపించినట్లు సమాచారం. సమగ్ర శిక్షణ లో అవకతవకలకు గల కారణాలు తెలుపుతూ సంజాయిషీ ఇవ్వాలి  నోటీసులో పేర్కొన్నారు.. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ తదుపరి ఆదేశాలు జారీ చేసేంతవరకు జి సి ఈ ఓ తన జీతం కూడా  క్లెయిము చేసుకోరాదని ఉత్వర్వులు జారీ చేసినట్లు తెలిసింది.