నలుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు

నిజామాబాద్, బతుకమ్మ: ప్రార్థన సమయానికి పాఠశాలకు రాని నలుగురు ఉపాధ్యాయులకు డీఈవో అశోక్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాలను గురువారం ఉదయం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఈవో పాఠశాలకు వెళ్లిన సమయంలో నలుగురు ఉపాధ్యాయులు లేకపోవడంతో వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల సమయానికి ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడంతోపాటు, పాఠశాల పరిసరాల్లో  పరిశుభ్రత పాటించాలని సూచించారు.