శానిటేషన్ నిర్లక్ష్యం వహించిన అధికారులకు 24 గంటల్లో షోకాజ్ నోటీసులు జారీ చేయాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : పారిశుద్ధ్య కార్యక్రమాలలో నిర్లక్ష్యం వహించిన మున్సిపల్ సిబ్బందికి మెమోలు జారీ చేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపాలిటీలోని 15 వ వార్డులో గల వినాయక నగర్ లో అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసినారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలు మొదలగు వాటిని అత్యవసరంగా పునరుద్ధరణకు ఎస్డిఆర్ఎఫ్ క్రింద మంజూరు ఇచ్చిన...