వడ్డెపల్లి సుభాష్ రెడ్డికి షోకాజ్ నోటీసులు
ఎల్లారెడ్డి, బతుకమ్మ : కాంగ్రెస్ నాయకులు వడ్డెపల్లి సుభాష్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ బి.చిన్నారెడ్డి ఈ మేరకు ఎల్లారెడ్డికి చెందిన కాంగ్రెస్ నాయకులు సుభాష్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ విభజించు పాలించు సూత్రాన్ని చేస్తున్న మీపై ఎందుకు చర్యలు తీసుకోవద్దో తెలుపాలని నోటీసులో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చే విధంగా చేస్తున్న సుభాష్...