Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 November 2024, 5:31 pm Posted by : ramakrishna

వడ్డెపల్లి సుభాష్ రెడ్డికి షోకాజ్ నోటీసులు

ఎల్లారెడ్డి, బతుకమ్మ  :

 

కాంగ్రెస్ నాయకులు వడ్డెపల్లి సుభాష్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ బి.చిన్నారెడ్డి ఈ మేరకు ఎల్లారెడ్డికి చెందిన కాంగ్రెస్ నాయకులు సుభాష్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ విభజించు పాలించు  సూత్రాన్ని చేస్తున్న మీపై ఎందుకు చర్యలు తీసుకోవద్దో తెలుపాలని నోటీసులో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ  పథకాలపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చే విధంగా చేస్తున్న సుభాష్ రెడ్డిపై చర్యలు తీసుకునే విధంగా కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ క్యాడర్ మనోభావాలను దెబ్బతీసే విధంగా సుభాష్ రెడ్డి వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు  చేయడంతో ఈ మేరకు పీసీసీ ఆదేశాల మేరకు క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో జవాబు ఇవ్వాలని లేకపోతే  చర్యలు ఉంటాయని నోటీసులో పేర్కొన్నారు. సుభాష్ రెడ్డి ఇటీవల రామారెడ్డికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త పై ఎమ్మెల్యే బెదిరింపులకు గురి చేశారని రోడ్డెక్కిన  విషయం తెలిసిందే.