- ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి సవాల్ విసిరిన
- బిఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు అభిలాష్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలువడానికి ప్రజలకు ఇచ్చిన హమీల అమలు గురించి ప్రశ్నించిన బిఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని, వాటిని బిఆర్ఎస్ యువజన విభాగం తీవ్రంగా ఖండిస్తుందని జిల్లా అధ్యక్షులు అభిలాష్ రెడ్డి అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం మీడియా సమావేశాన్ని ఉద్దేశించి అభిలాష్ మాట్లాడుతూ… ఆర్మూర్ నియోజక వర్గ యువతను మీరు ఇజ్రాయేల్ దేశానికి ఏవిధంగా పంపించారు? అసల (టాంకాం) సంస్థ ద్వారా ఇంటర్వూ తీసుకొని పంపిస్తారు కానీ మీరు ఎలా పంపించాను అన్నారో తెలియజేయాలని డిమాండ్ చేశారు.

ఎలక్షన్ లో రూపాయికే వైద్యం అందిస్తాను అన్నారు. ఇప్పటివరకు మీరు ఎంత మందికి వైద్యం అందించారో మా ఆర్మూర్ ప్రజలకు తెలియజేయండి అని కోరారు. ఆర్మూర్ నియోజక వర్గంలో ప్రతీ గ్రామంలో సంవత్సరానికి 10 చొప్పున ఇండ్లు కట్టిస్తాను అన్నారు. మరి ఎన్ని గ్రామాలకు ఇప్పటివరకు ఇండ్లు కట్టించారు తెలియజేస్తే సంతోషిస్తామని అన్నారు. మాజీ శాసన సభ్యులు ఆశన్న గారి జీవన్ రెడ్డి కోట్ల నిధులు తీసుకువచ్చి ఆర్మూర్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేశారు. ఇందులో 10 శాతం అయిన అభివృద్ధి చేసి చూపించండి అంటూ బహిరంగ సవాల్ విసిరారు. ఈ విలేఖరుల సమావేశంలో కృణాల్, రాజు, సంతోష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
