Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 February 2026, 5:21 pm Posted by : ramakrishna

ఇండిపెండెంట్ అభ్యర్థికి కామారెడ్డి చైర్మన్ పదవా ?

 

. . . రూ. 5 కోట్లకు డీల్ కుదిరిందంటూ ప్రచారం

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

కామారెడ్డి మున్సిపాలిటీ చైర్మన్ గా స్వతంత్ర అభ్యర్థి కీ ఖాయమైందనే ప్రచారం జోరందుకుంది. మరో కొన్ని గంటలల్లో ఛైర్ పర్సన్ ఎంపిక జరుగలసిన సమయం లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. కామారెడ్డి బల్దీయ ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. 49 మంది కౌన్సిలర్ ఉన్నా మున్సిపాలిటీ లో మ్యాజిక్ ఫిగర్ 25 ఏ పార్టీ కీ రాక పోవడంతో పార్టీల మార్పిడి, చేరికలు జోరందుకున్నాయ్. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినా అభ్యర్తి కాకుండా స్వతంత్ర అభ్యర్తిని ఎంపిక జరిగిందని ప్రపగండ జరుగుతుంది. పార్టీ అభ్యర్థులకు మొండి చెయ్యి చూపారని, కాసులు ఉన్నవారికి పదవి కట్టాబేడుతున్నారు అని కాంగ్రెస్ నాయకులు మండి పడుతున్నారు. ఈ వ్యవహారం లో కీలక నేత తమ్ముడు చక్రం తిప్పాడని కామారెడ్డి అంత కోడై కూస్తుంది. ఇప్ప సీను సతీమణికి కన్ఫామ్ చేశారని ప్రచారం మొదలైనది. ఈ విషయం తెలిసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నరు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు. కామారెడ్డి లో ఇపుడు చైర్మన్ ఎంపిక వ్యవహారం హాట్ టాఫిక్ గా నడుస్తుంది.

 

 

Should Kamareddy be the chairman for an independent candidate?

చైర్మన్ పోస్ట్ ఇండిపెండెంట్ కు అమ్ముకున్నారని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ ఫలితాలలో హంగ్ ఏర్పడింది. చైర్మన్ పదవికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 25 ఏ పార్టీకి రాలేదు. మున్సిపాలిటీలో మొత్తం 49 వార్డులు ఉండగా కాంగ్రెస్ 19, బీజేపీ 16, బీఆర్ఎస్ 11, ఇండిపెండెంట్ 3 వార్డుల్లో గెలుపొందారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందో వారే చైర్మన్ పదవి పొందనున్నారు. స్వతంత్రులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కారు పాటి కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్కు మద్దతు తెలుపుతున్నారని వాటిని తీవ్రంగా ఖండించారు. మీడియాకు విడుదల చేశారు.