Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 8:11 pm Posted by : ramakrishna

తక్షణమే అరెస్ట్ చేయాలి

 

. . . కేంద్రమంత్రి కుమారుడు పరారీలో ఉన్నాడు అనడం హాస్యాస్పధం

 

. . . సిట్ విచారణ పేరిట నిందితుణ్ణి తప్పించే ప్రయత్నం చేస్తున్న సర్కారు

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

పొక్సో కేసు నిందితుడు అయిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరత్ ను తక్షణమే అరెస్ట్ చేయాలని మంగళవారం మోర్తాడ్ మండల కేంద్రంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు కల్లెడ ఏలియా డిమాండ్ చేశారు. ఒక మైనర్ బాలికపై డ్రగ్స్, మద్యం ఇచ్చి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తున్నా, పోలీసులు మూడు నెలల పాటు ఫిర్యాదు తీసుకోకుండా తాత్సారం చేయడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉందని ఆరోపించారు. మీడియాలో వార్తలు వచ్చిన తర్వాతే గత్యంతరం లేక పోలీసులు కేసు నమోదు చేశారని మండిపడ్డారు. పోక్సో చట్టం ప్రకారం మైనర్ బాలిక చెప్పేది వేదం అని, అటువంటి కేసులో బాధితురాలికి రక్షణ కల్పించాల్సింది పోయి.. నిందితుడు ఆమెపైనే తిరిగి ‘హనీ ట్రాప్’ పేరుతో కేసు పెట్టడం దారుణమని అన్నారు. మైనర్ బాలిక హనీ ట్రాప్ చేస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. బాధితురాలిపైనే రివర్స్ కేసులు పెట్టడం చూస్తుంటే బండి సంజయ్ తన పలుకుబడి ఉపయోగించాడని అర్థమవుతోందని అన్నారు. అందుకే ఒక కేంద్ర మంత్రి కొడుకుపై ఇంత పెద్ద నేరం మోపబడినా ప్రభుత్వం మిన్నకుండిపోయిందని, ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా దీనిపై స్పందించకపోవడం వెనుక ఉన్న మర్మమేమిటని ప్రశ్నించారు. పొద్దున లేస్తే కేసీఆర్ కుటుంబం మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద విషం చిమ్మే బండి సంజయ్, తన కొడుకు చేసిన నేరంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇతరుల వ్యక్తిగత విషయాలను రాజకీయం చేసే సంజయ్, ఇప్పుడు తన కొడుకుపై వచ్చిన ఈ పోక్సో కేసుపై నైతిక బాధ్యత వహించి మంత్రి పదవి కి రాజీనామా చేసి తన నిజాయితీ నిరూపించుకోవలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పోలీసులు ఇప్పటికైనా ఒత్తిళ్లకు లొంగకుండా చట్టాన్ని గౌరవించాలని, బాధిత మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకు తాము పోరాడుతామని మండల పార్టీ అధ్యక్షులు కల్లెడ ఏలియా అన్నారు. కార్యక్రమంలో మోర్తాడ్ పీఏసిఎస్ చైర్మన్ కళ్లెం అశోక్, జిల్లా నాయకులు గోపి డి సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ అశోక్ గంధం మహిపాల్, చిన్నారెడ్డి మహేందర్, గనసాయి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.