Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 October 2024, 5:57 pm Posted by : ramakrishna

కోటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత

బతుకమ్మ , బాన్సువాడ : కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తగినన్ని మందులు లేక పేషంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా మొత్తంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత ఉన్నందువల్ల వచ్చిన పేషెంట్లకు ప్రిస్కేప్షన్ స్లిప్ లో నాలుగు లేక ఆరు మందులు మాత్రమే రాయడం జరుగుతుంది. తక్కువ మందులు ఇస్తున్నారని పేషంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి పేద మధ్యతరగతి ప్రజలు మాత్రమే వైద్య సహాయం కోసం వస్తారని వారికీ అవసరమైన మందులు ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రిస్కిప్షన్ రికార్డులో కూడా అదే నమోదు చేస్తున్నామని తెలిపారు. ఈ విషయమై ఆసుపత్రి వైద్యురాలు సుప్రియను వివరణ కోరగా మందుల కొరత ఉన్నట్లు తెలిపారు. అయినప్పటికీ ఆసుపత్రికి వచ్చిన రోగులకు తగినన్ని మందులు ఇచ్చి పంపిస్తున్నామని వివరించారు. మందుల కొరత పై ఉన్నతాధికారులకు కూడా తెలియజేసినట్లు ఆమె వివరించారు…