Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 July 2025, 3:43 pm Posted by : ramakrishna

వైద్యుల కొరత.. రోగుల వేతన..

  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్సు, ఫార్మాసిస్టు కొరత
  • తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులు

 

రుద్రూర్, బతుకమ్మ : ఆసుపత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా వేదిస్తోంది. దీంతో రోగుల పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్సు, రోగులకు మందులు అందించే ఫార్మసిస్టు కొరతతో ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రిలో చాలా రోజుల నుండి స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు పోస్టు ఖాళీగా ఉంది. ఇప్పటి వరకు స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు లేకపోవడంతో ఉన్నవారిపైనే అధిక భారం పడుతుందని,  ఆసుపత్రిలో విధులు నిర్వహించే వైద్య సిబ్బంది ఆసుపత్రికి వచ్చే రోగులకు చికిత్సలు అందిస్తూ మాత్రలు పంపిణి చేస్తున్నారు. దింతో ఆసుపత్రి వచ్చే రోగులకు సకాలంలో వైద్యం అందలేకపోతుందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు ఖాళీలను భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.