. . . తృటిలో తప్పిన అగ్ని ప్రమాదం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో గల టీ హబ్ లొ షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. టీ హబ్ కార్యాలయంలో ఉన్న ఏసీ కి గల వైర్లు ఒకదానికి ఒకటి తగిలి రాపీడితో ఈ ప్రమాదం సంబంధించినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న మీడియా సమాచారం కోసం టీ హబ్ కు వెల్లగా సమాచారం ఇవ్వడానికి అక్కడ ఉన్న అధికారులు వెనకడుగు వేశారు. షార్ట్ సర్క్యూట్ జరిగితే సమాచారం మీడియాకు తెలపాల్సిన వారు ఎందుకు గోప్యంగా ఉంచారు అర్థం కాలేదు. నిజంగా ఏసీకి కేబుల్ వైర్లకు షార్ట్ సర్క్యూట్ జరిగిందా.. లేదా ఇంకేదైనాప్రమాదం సంభవించిందాఅన్న అనుమానం తలెత్తుతుంది. ప్రమాదం సంభవించి షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే రోజు డయాగ్నొజిస్ట్ పరీక్షలు చేసేలక్షల రూపాయల విలువచేసే మెషిన్లు ఖాళీ బూడిదై ఉండేవి. కాగా ఇంత విలువైన మిషిన్లు ఉండే ఈ హబ్ లో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే ఆర్పడానికి ఫైర్ సేఫ్టీ నియమాలు కూడా హబ్అధికారులు పాటించడం లేదు. శనివారం షార్ట్ సర్క్యూట్ జరిగిన తర్వాత ఫైట్ సేఫ్టీ కి సంబంధించిన సిలిండర్లను గోడకు సిబ్బంది అమర్చడం విశేషం.
