Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 April 2025, 2:15 pm Posted by : ramakrishna

కిరాణాదుకాణంలో షార్ట్ సర్క్యూట్

. రూ.5లక్షల విలువైన సామగ్రి దగ్ధం

మహమ్మద్ నగర్, బతుకమ్మ: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కిరాణాదుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని రూ.5లక్షల విలువైన సామగ్రి దగ్ధమైంది. ఈ ఘటన మహమ్మద్ నగర్ మండలం గాలి పూర్ లో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంజి రాజు కిరాణా షాప్ దగ్ధమైంది.

మంటలు వ్యాపించి దట్టమైన పొగ కమ్ముకోవడం తో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. నీటిని తీసుకోని వచ్చి మంటలను అర్పడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

Short circuit in grocery store