ఖజానా జ్యువెలరీ షాప్ లో కాల్పుల కలకలం

హైదరాబాద్ లోని చందనగర్ లో  ఘటన హైదరాబాద్, బతుకమ్మ : చందానగర్ లోని ఖజానా జ్యువెలరీ షాప్ లో దుండగులు దోపిడీకి యత్నించారు.  ఎదురు తిరిగిన సిబ్బందిపై  కాల్పులు జరిపారు. ఆరుగురు దుండగులు రెండు రౌండ్ల ఫైరింగ్ చేశారు. తుపాకీ కాల్పులతో సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. డిప్యూటీ మేనేజర్ కాలికి గాయాలయ్యాయి. కాగా, ఈఘటన స్థానికంగా కలకలం రేపింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.