Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 4:53 pm Posted by : ramakrishna

శివాజీ వీరత్వం యావత్ భారత ప్రజలకు స్ఫూర్తిదాయకం

 

. . . టీఎంఆర్ పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లని శివ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరత్వం, నాయకత్వం, దేశభక్తి భావాలు యావత్ భారత ప్రజలకు స్ఫూర్తిదాయకమని టీఎంఆర్ పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ అన్నారు. శుక్రవారం చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా నగరంలోని ఆదర్శ్ నగర్ లో శివాజీ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన మహానాయకుడని, స్వరాజ్య స్థాపకుడు, ప్రజా పరిపాలనకు ఆదర్శంగా నిలిచిన మహావీరుడని అన్నారు. మొఘల్ సామ్రాజ్యాన్ని ధైర్యంగా ఎదురించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆయన, ధర్మ పరిరక్షణ, ప్రజా సంక్షేమం, సమర్థ పరిపాలనకు మార్గదర్శకుడిగా భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు అఖిల్ మాదిగ, యువసేన నాయకులు పాలెం వంశీరాజ్, బండారిపల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.