Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 5:25 pm Posted by : ramakrishna

శివాజీ జయంతి శోభాయాత్ర కరపత్రాల ఆవిష్కరణ

 

బోధన్, బతుకమ్మ :

 

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ నెల 19న నిర్వహించనున్న భారీ శోభాయాత్రకు సంబంధించి కరపత్రాలను బోధన్ పట్టణంలో ఆవిష్కరించారు. హిందూ వాహిని బోధన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ బోధన్ నగర కార్యవాహ దులిశెట్టి అనిల్ కుమార్ జీ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా హిందూ వాహిని ప్రాంత శిక్షణ టోలీ సభ్యుడు బండి శ్రవణ్ మాట్లాడుతూ శివాజీ మహారాజ్ తన చివరి శ్వాస వరకు హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడిన మహనీయుడని పేర్కొన్నారు. అలాంటి మహానుభావుడి జయంతిని ఘనంగా నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల యువతతో పాటు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని హిందూ ఐక్యతను చాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పులి సాయిలు, సుంకు శేఖర్, సురేష్ పటేల్, నగర సహ సంయోజకులు శ్రవణ్, విజయ్ సింగ్, గుంత శేఖర్, పాలకుర్తి లక్ష్మణ్, కేశవ్ మహేష్, ఇందురు చరణ్, ఒడ్డేన్నతో పాటు కార్యకర్తలు నాగనాథ్, ఏశల రాజు, సలిగింజ రాజు, మాధవ్, వంకాయల రాము, ద్యాకం గంగాధర్, సాయి తదితరులు పాల్గొన్నారు.