Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 September 2025, 2:59 pm Posted by : ramakrishna

బీజేవైఎం మండల అధ్యక్షునిగా శెట్టి ప్రేమ్ చంద్

భీమ్ గల్, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మండల అధ్యక్షునిగా మండలంలోని బాచన్ పల్లి గ్రామానికి చెందిన శెట్టి ప్రేమ్ చంద్ నియమితులయ్యారు. బాల్కొండ కానిస్టెన్సీ పార్టీ ఇంచార్జ్ డాక్టర్. మల్లికార్జున్ రెడ్డి మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన సందర్బంగా శెట్టి ప్రేమ్ చంద్ నియామక పత్రాన్ని ఆయన అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్టీ మనకు గురుతర భాద్యతను అప్పగించినపుడు పార్టీ కోసం అంకిత భావంతో పనిచేయాలని ఆయన సూచించారు. నీకిచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మున్ముందు మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని ఆయన ఆకాంక్షించారు. కేంద్రంలో బీజేపీ పార్టీ చేస్తున్న సంక్షేమభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన తెలిపారు, అనంతరం బీజెవైఎం  మండల అధ్యక్షునిగా ఎన్నికైన ప్రేమ్ చంద్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనకిచ్చిన ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకొంటానని అన్నారు. ఈ కార్యక్రమం లో మండల బీజేపీ పార్టీ నాయకులు, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.