Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 October 2025, 6:22 pm Posted by : ramakrishna

దుర్గా నవరాత్రి ఉత్సవాలలో ఆకతాయిలకు చెక్ పెట్టిన షీ టీం

 

. . . సెప్టెంబర్ మాసంలో 80 హాట్స్ స్పాట్ లు తనిఖీ

. . . 19 రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కేసులు నమోదు.

. . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

ఆపద సమయంలో అతివలకు అండగా నిజామాబాద్ షి టీం బృందం 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవలందిస్తుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య తెలియజేశారు. దుర్గా నవరాత్రి ఉత్సవాలలో రాత్రి సమయాల్లో ఆకతాయిలు అల్లరి చేస్తూ మహిళలను వేధించిన సందర్భాలలో రెడ్ హ్యాండెడ్ గా  సెప్టెంబర్ నెలలో 19 కేసులు నమోదు చేసినట్లు , షీ టీం బృందం ప్రత్యేకంగా రాత్రి సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో సంచరిస్తూ మహిళలను వేధిస్తున్న వారిపై దృష్టి సారించిందని తెలిపారు.  జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ షీ టీం బృందాలు యువతులకు , విద్యార్థిని విద్యార్థులకు , పని స్థలాల్లో మహిళలకు ప్రత్యేకంగా 26 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చైతన్య పరచడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ నెలలో షీ టీం బృందాల ద్వారా 11 ఈ పెట్టి కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. షీ టీం బృందాలు గత నెల రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 80  హాట్ స్పాట్ ల లో తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. పలు గ్రామాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. షి టీం బృందం సభ్యులు చాకచక్యంగా వ్యవహరిస్తూ నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేక బృందంచే మహిళలకు రక్షణగా , మహిళలు వేధింపులకు గురి కాకుండా అడ్డుపడుతూ ఆకతాయిల పట్ల చట్టపరంగా వ్యవహరిస్తూ ఉందని తెలిపారు. 7 కౌన్సిలింగ్ ల ద్వారా కేసులలో పరిష్కారం చేయబడింది అని తెలిపారు. ఆపత్కాల సమయంలో నిజామాబాద్  షి  టీం బృందాల ను సంప్రదించాలంటే 8712659795 నంబర్  ఫోన్ ద్వారా సంప్రదించాలన్నారు.  26  గ్రామాలలో కార్యక్రమాలు నిర్వహించి మహిళల పట్ల జరిగే నేరాలపై , చైల్డ్ మ్యారేజ్ , సైబర్ నేరాలపై , సోషల్ మీడియా నేరాలపై , చిన్నారులకు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ లపై అవగాహనలు కల్పించి చైతన్య పరచడం జరిగిందని తెలియజేశారు. ఈ నెలలో మహిళల సమస్యలతో దాదాపు 07 మొబైల్ ఫోన్ కాల్స్ వచ్చినట్లు వారికి తగిన సమస్య పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. షీ టీం బృంద సభ్యులు మహిళా  ఆర్ఎస్ఐ స్రవంతి , హెడ్ కానిస్టేబుల్  సుమతి , ఆశయ్యా , కానిస్టేబుల్ లు విగ్నేష్ , శ్రీకాంత్ , నాగరాజు , రేఖా రాణి , హరిత రాణి , రాధిక మహిళా సిబ్బంది షీ టీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.