Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 4:36 pm Posted by : ramakrishna

శశాంక్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

బీజేపీ కి ఓటు వేసి శశాంక్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. 42 వ డివిజన్ లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నగర అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కార్నర్ మీటింగ్‌కు స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ఉత్సాహంగా నినాదాలు చేశారు. డివిజన్ 42లో బీజేపీకి అనుకూల వాతావరణం కనిపిస్తోందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.