Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 4:56 pm Posted by : ramakrishna

సమాన విలువలు పంచితే అదే మాకు ఇచ్చే గౌరవం

 

. . . ఐద్వా జిల్లా కార్యదర్శి బి. సుజాత

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

సమాజంలో సగభాగమని గుర్తించి సమాన విలువలు పంచితే అదే మాకు ఇచ్చే గౌరవం అని ఐద్వా జిల్లా కార్యదర్శి బి.సుజాత అన్నారు. నిజామాబాద్ నగరం లోని దుబ్బ బీసీ డిగ్రీ ఉమెన్స్ హాస్టల్ లో ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

 

Sharing equal values ​​is the respect we are given.

 

అనంతరం మాట్లాడుతూ గంజాయి, మద్యానికి బానిసై వయసుతో సంబంధం లేకుండా మహిళలపై, ఆడపిల్లలు, చిన్నారులపై జరుగుతున్న హింసను అరికట్టి, ఎలాంటి రాజకీయ ఒత్తిడిలకు తల వంచకుండా బలైపోయిన మహిళలకు, చిన్నారులకు న్యాయం చేస్తే అదే నిజమైన గౌరవంగా భావిస్తామని అన్నారు. అందుకే ఐద్వా సమానత్వం, ప్రజాస్వామ్యం స్త్రీ విముక్తికై నిరంతరం పోరాటాలు చేస్తూ మహిళల్లో ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యురాలు రజియా, నగర నాయకురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

 

Sharing equal values ​​is the respect we are given.