- సార్ ను ప్రసన్నం చేసుకోవాలంటే సెక్షన్ లో కలువాల్సిందే
- నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో చిక్కింది చిన్న చేపే
- ఇంచార్జీ ఆర్ఐ వాంగ్మూలంలో అధికారుల పేర్లు బహిర్గతం
- అవినీతి అధికారులపై సిఫారసులకు పరిమితమౌతున్న ఏసీబీ
- చర్యలకు మోకాలడ్డుతున్న వైనంతో రెచ్చిపోతున్న లంచావతారాలు
నిజామాబాద్, బతుకమ్మ : అవినీతి నిరోధక శాఖ రికార్డులలో అత్యంత అవినీతి శాఖాగా పేరుంది మున్సిపల్. అలాంటి శాఖలలో మున్సిపల్ కార్పొరేషన్ అంటే అక్కడ పైసలు లేనిదే ఎలాంటి పనులూ జరుగవు. అక్కడ అధికారులను కలువాలంటే ముందుగా సెక్షన్ లో కింది స్థాయి సిబ్బందిని కలిసి ప్రసన్నం చేసుకోవాలి. కీలకమైన పలు విబాగాలు(సెక్షన్) ల లో కిందిస్థాయి సిబ్బందిని కలిసి వారు అడిగింది ముట్టచెబితే కాని పై అధికారి కలువరు. సెక్షన్ సిబ్బందికి సంబంధం లేకుండా అధికారిని కలిసిన పని కాదు. ఎందుకంటే అధికారులు నేరుగా లంచం తీసుకుంటే ఎక్కడ పట్టుబడుతామోనని సెక్షన్ సిబ్బందిని ముందు పెట్టి వసూళ్ల కార్యక్రమం నిరాటంకంగా చేపడుతున్నారు. ఈ విషయం బుధవారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంచార్జీ ఆర్ఐ (సీనియర్ అసిస్టెంట్) కన్న శ్రీనివాసరావు లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. మాజీ సైనికోద్యోగికి సంబంధించిన ఖాళీస్థలం (విఎల్ టి) కేటాయించడానికి రూ.7 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్ గా పట్టుబడిన ఆర్ఐ ని విచారించడంతో పలు సంచలన విషయాలు బహిర్గతమైనట్టు తెలిసింది
నిజామాబాద్ బల్దియాలో అవినీతిలో మెట్ల వ్యవస్థ ఉంది. అక్కడ ప్రతి సెక్షన్ లో అధికారులకు కావాల్సిన వారు పనిచేస్తున్నారు. సంబంధిత సెక్షన్ లకు బాస్ లను కలువాలంటే వారితో పని జరుగాలంటే సెక్షన్ సిబ్బందిని కలువాల్సిందే. అందుకే బల్దియాలో రెగ్యులర్ ఉద్యోగులను కుడా పక్కన పెట్టి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ముందు పెట్టి వసూళ్ల దందా మూడు పువ్వులు ఆరు కాయాలుగా సాగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రతిసెక్షన్ లో ఉన్న కిందిస్థాయి సిబ్బంది ద్వార ప్రతి పనికి డబ్బులను వసూలు చేసి వాటాలు వేసుకుని పంచుకుంటారు అనే నానుడి ఉంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో టౌన్ ప్లానింగ్, రెవిన్యూ, ఇంజనీరింగ్ చివరకు చెత్త సేకరించి పరిశుభ్రంగా ఉంచు హెల్త్ విభాగం కుడా అవినీతికి కేరాఫ్ అని చెప్పాలి. అనితీలో ఆరితేరిన జలగలను ఏరికోరి సెక్షన్ లలో పోస్టింగ్ లు తెచ్చుకోవడమే కాకుండా ముక్కుపిండి వసూలు చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకున్న దాఖాలలు లేవు. ఇక పాలకవర్గాలు ఉంటే అధికారుల పనితనం కంటే లీడర్ల పెత్తనమే ఎక్కువ.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మెట్ల వ్యవస్థలో సెక్షన్ బాస్ లపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. బుధవారం ఏసీబీకి చిక్కిన ఆర్ ఐ కుడా తాను సొంతంగా డబ్బులు (లంచం) అడుగలేదని తనపై అధికారుల ఆదేశాల మేరకు ముడుపులు అడిగానని విచారణలో చెప్పినట్లు తెలిసింది. ప్రధానంగా రెవిన్యూ సెక్షన్ అంటే బల్దియాకు ఆదాయం కంటే అధికారుల ఆదాయవనరుగా చెబుతున్నారు. గత ఏడాది ఆగస్టు 9న రెవెన్యూ ఇన్స్సపెక్టర్ ఇంచార్జీ రెవిన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంటిలో 6.7 కోట్ల నగధు దొరికినప్పుడు అతడిని ఏసీబీ విచారణలో అప్పటి అధికారులపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా అమెరికా వెళ్లడానికి డాలర్ ల మార్పిడి అంశం వెలుగు చూసింది. ఆనాడు ఏసీబీ అధికారులు సంబంధిత రెవిన్యూ సెక్షన్ లో లంచావతారాల గురించి చర్యలకు సిఫారసు చేసిన అవి బుట్టదాఖలు అయ్యాయి. ఈ నెల 3న రెవిన్యూ సెక్షన్ అధికారుల లీలల గూరించి ఏసీబీ అధికారుల దాడిలో వెల్లడైన ఆ శాఖాధికారులు చర్యలకు సిఫారసు చేసిన పని జరుగుతుందా లేక అవి చుట్టబండలు అవుతాయో వేచి చూడాలి.