Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 September 2025, 1:29 pm Posted by : ramakrishna

శంభు లింగేశ్వర ఆలయం మూసివేత

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   నగరంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన శంభులింగేశ్వర దేవస్థానం(శంభునిగుడి) ని ఆదివారం మధ్యాహ్నం రాహుగ్రస్త చంద్ర గ్రహణం కారణంగా మూసివేశారు. ఆదివారం ఉదయం పూజలు చేసిన అనంతరం ఆలయం మూసివేసినట్లు చైర్మన్ బింగి మధు అలియాస్ పూసల మధు తెలిపారు. చంద్ర గ్రహణం కారణంగా ఆలయం ద్వారబంధం చేసినట్లు పేర్కొన్నారు. ఆలయ సంప్రోక్షణ అనంతరం  సోమవారం ఉ: 6.00 గంటలకు తర్వాత భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తామని ఆయన తెలిపారు.

Shambhu Lingeshwara Temple Closure