Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 6:28 pm Posted by : ramakrishna

షహిద్ భగత్ సింగ్ ని ఆదర్శంగా తీసుకోవాలి

 

. . . పీడీఎస్ యు ప్రధాన కార్యదర్శి మున్నా

 

ఇందల్ వాయి, బతుకమ్మ :

 

అతి చిన్న వయసులో దేశం కోసం ఉరితాడునే ముద్దాడిన షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను నేటి విద్యార్థులు, యువత ఆదర్శంగా తీసుకోవాలని పీడీఎస్ యు ప్రధాన కార్యదర్శి మున్నా తెలిపారు. ఇందల్ వాయి గ్రామంలో షహీద్ భగత్ సింగ్ 95 వ వర్ధంతి సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. షహిద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ 95వ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, పాటలు, డ్రాయింగ్, ఉపన్యాస పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యు మండల నాయకులు అరవింద్, లక్ష్మణ్ లతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.