Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 April 2025, 1:36 pm Posted by : ramakrishna

బాధిత కుటుంబానికి షబ్బీర్ అలీ చేయూత

నిజామాబాద్, బతుకమ్మ :  బాధిత కుటుంబానికి షబ్బీర్ అలీ చేయూతనిచ్చారు. హిందూ ఫోటోగ్రాఫర్ రమణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మృతుడి భార్య కు ఆదివారం ప్రభుత్వ సలహాదారు రూ.25 వేల ఆర్థిక సహాయం అందించారు. హిందూ పత్రిక రెసిడెన్సీ ఎడిటర్ రవిరెడ్డి సూచన మేరకు షబ్బీర్ అలీ ఆర్ధిక సహకారం అందించారు. ఈ సందర్బంగా యూనియన్ ప్రతినిధులు షబ్బీర్ అలీ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజె – ఐజెయూ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్, యూనియన్ ప్రతినిధులు అహ్మద్ అలీఖాన్, ధనుంజయ్, గోవిందరాజు, రతన్ లు పాల్గొన్నారు.