విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ను సందర్శించిన షబ్బీర్ అలీ

మెండోరా, బతుకమ్మ: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్  దిగువన ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రం బుధవారం అడ్వైజర్ ఆప్ తెలంగాణ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ నాయకులు షబ్బీర్ అలీ సందర్శించారు. విద్యుత్ ఉత్పత్తి ఎంత జరుగుతుంది. ఈ సంవత్సరం విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం ఎంత తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు పవర్ హౌజ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.