ఎమ్మెల్యే భూపతి రెడ్డిని పరామర్శించిన షబ్బీర్ ఆలీ

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి తల్లి లక్ష్మీ నర్సమ్మ   మృతి చెందిన విషయం తెలిసిందే. బుధవారం అశోక టౌన్ షిప్ లోని ఎమ్మెల్యే  నివాసం లో ప్రభుత్వ సలహాదారు,  మాజీ మంత్రి  షబ్బీర్ ఆలీ  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని పరామర్శించారు. అనంతరం లక్ష్మీ నర్సమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి  ప్రగాఢ సానుభూతి  తెలిపారు. అలాగే నిజామాబాద్ నూడా చైర్మన్ కేశ వేణు  రూరల్ ఎమ్మెల్యే  భూపతి రెడ్డి ని  పరామర్శించారు. షబ్బీర్ ...