సామాన్యుడిలా క్యూలైన్‌లో నిలబడి ఓటు వేసిన షబ్బీర్ అలీ
కామారెడ్డి బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో కామారెడ్డి పట్టణం రాజకీయ కోలాహలంతో నిండిపోయింది. బుధవారం జరుగుతున్న ఈ పోలింగ్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తన ఓటు హక్కును వినియోగించుకొని పౌర బాధ్యతను చాటుకున్నారు. ఉదయాన్నే పట్టణంలోని వార్డు నెంబర్ 49, పోలింగ్ స్టేషన్ నెంబర్ 151 (గంజ్ స్కూల్) కు చేరుకున్న షబ్బీర్ అలీ, ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా ఒక సాధారణ పౌరునిలా క్యూలైన్‌లో నిలబడ్డారు. తన వంతు...