షబ్బీర్ అలీకి ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత కల్పించాలి

మాచారెడ్డి మండల నాయకుల విన్నపం   బతుకమ్మ, మాచారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి  ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత కల్పించాలని మాచారెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు కోరారు.  పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కామారెడ్డి నియోజకవర్గంలో ప్రతీ కార్యకర్తకు, ప్రజలకు అండగా ఎనలేని సేవలందిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన ఘనత షబ్బీర్ అలీకే దక్కిందన్నారు.  నియోజకవర్గంలో  ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని ఆలయాలకు, పేద ప్రజలకు సొంత నిధులతో తన వంతు సహకారం అందిస్తూ అండగా నిలుస్తున్నారని అన్నారు....