Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 March 2025, 7:08 pm Posted by : ramakrishna

షబ్బీర్ అలీకి ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత కల్పించాలి

  • మాచారెడ్డి మండల నాయకుల విన్నపం  

బతుకమ్మ, మాచారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి  ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత కల్పించాలని మాచారెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు కోరారు.  పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కామారెడ్డి నియోజకవర్గంలో ప్రతీ కార్యకర్తకు, ప్రజలకు అండగా ఎనలేని సేవలందిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన ఘనత షబ్బీర్ అలీకే దక్కిందన్నారు.  నియోజకవర్గంలో  ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని ఆలయాలకు, పేద ప్రజలకు సొంత నిధులతో తన వంతు సహకారం అందిస్తూ అండగా నిలుస్తున్నారని అన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని గత 44 ఏళ్లుగా పార్టీ లో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులుగా బలమైన క్యాడర్ తో తిరుగులేని నాయకుడిగా ఉన్న షబ్బీర్ అలీ కి ప్రస్తుత ఎమ్మెల్సీ స్థానాల్లో ఆయనకు అవకాశం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ప్రజానాయకుడైన షబ్బీర్ అలీకి గవర్నర కోటాలో నైనా ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించి మంత్రివర్గంలో సముచిత స్థానం ఇచ్చి ఆయన సేవలు ప్రభుత్వం వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లకు వారు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు రావుల ప్రభాకర్ రావు, నువ్వు నా వద్ద గణేష్ నాయక్, రానా ప్రతాప్ నాయక్, లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు.