ఇస్తేమా కోసం స్థల పరిశీలన చేసిన షబ్బీర్ ఆలీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జనవరిలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే తబ్లిక్ జమాత్ ఇస్తేమా సభా స్థలాన్ని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ అధికారులతో కలిసి పరిశీలించారు. నగర శివారులోని సారంగాపూర్ తబ్లికే జమాతే ఇస్తేమా కోసం విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్, ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. తెలంగాణ, మహారాష్ట్ర నుండి 2 లక్షల మంది ముస్లీంలతో దాదాపు వంద ఎకరాల్లో సభకు హాజరవుతారని, ప్రభుత్వం నుండి అన్ని ఏర్పాట్లను చేయడానికి కసరత్తు మొదలుపెట్టారు. సభకు వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని...