Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 10:20 am Posted by : ramakrishna

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి షబ్బీర్ ఆలీ దీపావళి వేడుకలు

 

 

భిక్కనూరు, బతుకమ్మ :

 

కామారెడ్డి నియోజకవర్గం భిక్కనూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు దుంపల మణెమ్మ, మెతుకు మీనా నూతన ఇందిరమ్మ గృహంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఘనంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పాల్గొని చాలా సంవత్సరాలుగా సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ఎదురుచూస్తున్న దుంపల మణెమ్మ, మెతుకు మీనా కుటుంబాలకు ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో వారి ఆనందంలో భాగస్వామ్యం అవ్వడం జరిగిందని షబ్బీర్ అలీ తెలిపారు. ఈ సందర్భంగా దుంపల మణెమ్మ, మెతుకు మీనా దంపతులకు స్వీట్లు తినిపించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి టపాసులు కాల్చారు. ప్రజాపాలన ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేస్తోందని, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతోందని ఈ సందర్భంగా షబ్బీర్ అలీ  పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Shabbir Ali celebrates Diwali with beneficiaries of 'Indiramma' houses