బతుకమ్మ, ఏర్గట్ల: మండలంలో రూ.15 లక్షలతో షాదీఖాన, తాళ్లారంపూర్, దోంచంద గ్రామంలో రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయితీ భవనాలను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పూర్ణానందం, మండల తాసిల్దార్ శ్రీలత, గ్రామ శాఖ అధ్యక్షుడు దేవుడు నరసయ్య, మాజీ ఎంపీటీసీ డాక్టర్ మధు, సింగల్ విండో అధ్యక్షులు బర్మ నరసయ్య, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బద్దం శ్రీనివాస్ రెడ్డి, గడ్డం రమేష్, బద్దం హనుమాన్లు, నేరెళ్ల లింగారెడ్డి, లక్కం నరసయ్య,పౌలింగ్, జైనుద్దీన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
