Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 December 2024, 8:29 pm Posted by : ramakrishna

ఎస్జిటియు బిచ్కుంద మండల కార్యవర్గం ఎన్నిక

బతుకమ్మ: బిచ్కుంద : ఎస్జీటీయూ  బిచ్కుంద మండల శాఖ కార్యవర్గాన్ని  సోమవారం ఎస్జీటీయూ కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరి స్వామి, అతిథి గా సంతోష్ రాథోడ్  ఆధ్వర్యంలో   ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడి గా షేఖ్ ఖయ్యూమ్, అసోసిటేట్ ప్రెసిడెంట్ గా రోటేవార్ సంతోష్, మండల ఉపాధ్యక్షులుగా రవి జాదవ్,షేఖ్ చాంద్ పాషా, ప్రధాన కార్యదర్శిగా టోనేవార్ మారుతి, కోశాధికారిగా షేఖ్ నహీం, సహాయ కార్యదర్శిగా అన్సర్ ఘోరి, సాంకేతిక సలహాదారులు గా నాగనాథ్, ముఖ్య సలహాదారులుగా హరికృష్ణ,సంగమేశ్వర్లు, మండల మహిళా అధ్యక్షురాలిగా మేత్రి సంగీత, మండల మహిళా ప్రధాన కార్యదర్శి గా వినీత, మండల ఉపాధ్యక్షురాలు గా రోజా లను ఎన్నుకున్నారు.