Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 November 2025, 8:12 pm Posted by : ramakrishna

పత్తాలాట మానుకోకపోతే తీవ్ర చర్యలు

  • ‘బతుకమ్మ’ కథనంపై ఎంపీ అర్వింద్ స్పందన

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో జోరుగా పత్తాలాట నడుస్తున్నట్లు నాకు సమాచారం వచ్చింది. ఎవరైనా భారతీయ జనతా పార్టీ నాయకులు ఆర్గనైజర్లుగా జూదం నడిపిస్తే ఈ క్షణమే మానుకోండి లేదంటే మీ తదుపరి రాజకీయ జీవితం ప్రశ్నార్థకమౌతుందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 3న బతుకమ్మ దినపత్రికలో క్లబ్ లను మరిపిస్తున్న పత్తాలాట పేరిట పొలిటికల్ పార్టీల లీడర్లే ఆర్గనైజర్లు అయితే కథనం ప్రచురితమైన విషయం తెల్సిందే. దీనిపై స్పందించిన ఎంపీ అరవింద్ పత్తాలాట మానుకోవాలని, కొందరి పేర్లు నా దృష్టిలో ఉన్నాయని వేరిఫై చేసి చర్యలు తప్పవన్నారు.