వెబ్ న్యూస్,బతుకమ్మ : మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో రైలు పట్టాలపైకి వరద నీరు చేరింది. డోర్నకల్ రైల్లే స్టేషన్లో పట్టాల పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో ఈరైల్వే స్టేషన్ లో గోల్కొండ ఎక్స్ ప్రెస్, మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగులో కోణార్క్ ఎక్స్ ప్రెస్, ఏపీలోని కష్ణా జిల్లా కొండపల్లిలో సాయినగర్ షిర్డీ ఎక్స్ ప్రెస్ లను అధికారులు నిలిపివేశారు.
మొంథా తుపాను ప్రభావంతో 127 రైళ్లు రద్దు
మొంథా తుపాను, వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే 127 రైళ్లను రద్దు తాత్కాలికంగా రద్దు చేయడంతో పాటు మరో 14 రైళ్లను దారి మళ్లించింది. ఫలక్ నుమా, ఈస్ట్ కోస్ట్, గోదావరి, విశాఖ, నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లను రద్దు చేశారు.
