బాన్సువాడ, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లాలో పలువురు ఎస్సైలను ఎస్పీ రాజేష్ చంద్ర బదిలీ చేశారు. గత కొంతకాలంగా వీఆర్ లో ఉన్న పోలీసులకు ఎట్టకేలకు పోస్టింగ్ లభించింది.వీఆర్ లో ఉన్న ఎస్సై మహేందర్ ను బీర్కూర్ బదిలీ చేశారు. ప్రకాశ్ ను బాన్సువాడ టౌన్ కు పంపించారు. వీకే రాములుకు బాన్సువాడ టౌన్ కు పోస్టింగ్ ఇచ్చారు. బీర్కూర్లో పని చేస్తున్న రాజశేఖర్ ను కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన కు బదిలీ చేశారు. కామారెడ్డి కోర్టులో లైజన్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న రాజయ్యనువిఆర్ కు అటాచ్ చేశారు. విఆర్ లో ఉన్న దత్తాద్రి గౌడ్ ను దేవునిపల్లికి బదిలీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ఉత్తర్వులలో పేర్కోన్నారు.