. . . పోక్సో చట్ట ప్రకారం మరో ఐదేల్ల కారాగారం
. . . బాలికకు రెండు లక్షల రూపాయల పరిహారం చెల్లింపునకు నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థకు సిపార్సు
. . . నిజామాబాద్ జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి ధర్మవరపు వరూధిని తీర్పు
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :
ఒక ఏడేళ్ల బాలికను వివస్త్రను చేయడం ఆ పై లైంగిక దాడి చేసిన బింగి అంకుష్ కు ఏడు, ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్షలు విదిస్తూ నిజామాబాద్ ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి ధర్మవరపు వరూధిని సోమవారం తీర్పు చెప్పారు. కోర్టు తీర్పులోని వివరాలు. నిజామాబాద్ నగరంలోని ఒక కాలోనిలో నివాసుముండే నలభై సంవత్సరాల బింగి అంకుష్ తన ఎదురింటిలో తల్లితండ్రులతో కలిసి ఉన్న ఏడేళ్ల బాలికపై చెడు ద్రుష్టి కలిగి ఉన్నాడు.2020 మార్చి,20 న సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇంటి పైన ఏడు సంవత్సరాల బాలిక దుస్తులు పైకి జరిపిన అంకుష్ తన తొడలపైన కూర్చుండబెట్టుకునడం చూసిన ఎదురింటి మహిళ కేకలు వేయడంతో అక్కడి నుండి పారిపోయాడు.బాలిక తల్లి పిర్యాదు స్వీకరించిన పోలీసులు పూర్తిస్తాయిలలో నేర విచారణ నిర్వహించిన అనంతరం కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు.కోర్టు నేర న్యాయ విచారణలో భాగంగా బాలిక వాంగ్మూలంతో పాటు సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసిన కోర్టు ధ్రువీకరించుకున్న పత్రాలు మార్క్ చేసింది. సాక్షధారాల అనుసారం ముద్దాయి బింగి అంకుష్ ను దోషిగా నిర్దారించింది. భారత శిక్షస్కృతి సెక్షన్ 354(బి ) నేరపూరిత బల ప్రయోగంతో వివస్త్రను చేసిన నేరంకుగాను ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా మూడు నెలల జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం -2012 సెక్షన్ 7 లైంగిక దాడి నేరంకు గాను ఐదు సంవత్సరాల కఠిన జైలుశిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకుంటే అదనంగా రెండు నెలల జైలుశిక్ష అనుభవించాలని అదనపు జిల్లా సెషన్స్ జడ్జి వరూధిని తమ తీర్పులో వ్రాశారు. పోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరసింహ రెడ్డి ప్రాసిక్యూషన్ నిర్వహించారు.
. . . బాలికకు రెండు లక్షల రూపాయల పరిహారానికి సిపార్సు
లైంగిక దాడికి గురైన బాలికకు నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ రెండు లక్షల రూపాయల పరిహారం అందజేయాలని జడ్జి వరూధిని సిపార్సు చేశారు.జాతీయ న్యాయసేవల ప్రధికార సంస్థ నాల్సా దేశ వ్యాప్తంగా బాధితుల నష్ట పరిహార పథకంను అమలు చేస్తున్నది. క్రిమినల్ నేరాలలో తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలు, పోక్సో కేసులలో తీవ్రమైన లైంగిక దాడులకు గురైన పిల్లలకు ఈ పథకంలో భాగంగా నేర తీవ్రతనుబట్టి పరిహారం అందజేస్తారు.