పాఠశాల భవనం కూలి ఏడుగురు విద్యార్థులు మృతి
రాజస్థాన్ లోని ఝాలవర్ జిల్లాలో విషాదం వెబ్ న్యూస్, బతుకమ్మ : రాజస్థాన్ లోని ఝాలవర్ లో విషాదం చోటు చేసుకుంది. ఝాలవర్ జిల్లా మనోహర్ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల భవనం పై కుప్పకూలి విద్యార్థులపై పడింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ చిన్నారులను సమీప ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.