ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండలం రాణంపల్లి గ్రామంలో గురువారం రాత్రి పేకాట స్థావరం పై రుద్రూర్ పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఏడుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ.4510 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు. పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.