Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 June 2025, 8:20 pm Posted by : ramakrishna

ఏడుగురికి ఏడాది సాధారణ జైలుశిక్ష

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ముగ్గురిని తీవ్రంగా గాయపరిచిన ఏడుగురికి ఏడాది సాదారణ జైలుశిక్ష విదిస్తూ నిజామాబాద్ మొదటి అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (ప్రిన్స్ పాల్ జూనియర్ సివిల్ జడ్జి )ఖుష్భూ ఉపాధ్యాయ్ బుధవారం తీర్పు వెలువరించారు.వివరాలు.. నిజామాబాద్ నగరంలోని ద్వారాక నగర్ కు చెందిన ఖాజా భీ కొడుకు సాధిక్, షేక్ హాజీ దగ్గర తన గ్యాస్ సిలిండర్ ను ఐదు వందల రూపాయలకు కుదువ పెట్టాడు.7 ఫిబ్రవరి, 2015 న రాత్రి పది గంటలకు హాజీ దగ్గరకు వెళ్లి ఐదు వందలు తీసుకుని గ్యాస్ సిలిండర్ తిరిగి ఇవ్వమని కోరింది. వేయి రూపాయలు ఇస్తేనే సిలిండర్ ఇస్తానని చెప్పగా ఇది ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. రాత్రి రెండున్నర గంటలకు ఖాజా భీ ని షేక్ హాజీ, షేక్ ఇజాజ్, అప్సర భేగం కట్టెలతో, రాడ్ తో తలపై కొట్టగా ఆమె కూతురు సాయిద బేగం, ఆమె అల్లుడు షేక్ మౌలానాను షేక్ ఖయ్యుమ్, నసీమ, షేక్ అన్వర్, పర్వీన్ బేగం, షేక్ మక్బూల్ కూడా కట్టెలతో కొట్టి తీవ్రంగా గాయపరచ్చినారు. పై నేరారోపణలు కోర్టు నేర న్యాయ విచారణలో రుజువు కావడంతో ముద్దాయిలు షేక్ ఖయ్యుమ్, నసీమ, షేక్ అన్వర్, షేక్ హాజీ, షేక్ నయీమ్, షేక్ ఇజాజ్, పర్వీన్ బేగం లకు ఒక్కొక్కరికి ఒక సంవత్సరం సాదారణ జైలుశిక్ష తో పాటు మూడు వేల రూపాయల జరిమానా విధించారు.జరిమానా చెల్లించని యెడల అదనంగా నెల రోజుల సాదారణ జైలుశిక్ష అనుభవించాలని జడ్జి ఊపాధ్యాయ్ తమ తీర్పులో పేర్కొన్నారు.కోర్టు విచారణ దశలో ఉండగా షేక్ మాక్బుల్ మరణించారు.