- జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ విద్య
బతుకమ్మ బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఇటీవల బాలుడిని చేర్పించగా చికిత్స అందించడంలో నిర్లక్ష్యం చేయడంతో మృతి చెందాడు.బాలుడు మృతి చెందిన ఘటనలో ఓ ప్రైవేటు ఆస్పత్రి అనుమతులు రద్దు చేస్తున్నట్లు వైద్యాధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ విషయమై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో విచారణ చేపట్టారు. విచారణలో రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం తేలింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు ప్రైవేటు ఆస్పత్రి అనుమతులు రద్దు చేస్తున్నట్లు సంబంధిత యాజమాన్యానికి నోటీసులు అందించారు. బాధ్యతా రహితంగా వ్యవహరించినందుకు మూడు రోజుల్లో ఆస్పత్రి మూసివేయాలని నోటీసులో పేర్కొన్నట్లు డిప్యూటీ డీఎంహెచ్వో విద్య తెలిపారు.